Wednesday 25 July 2018

కొత్తగా నియామకం కానున్న కార్యదర్శుల మూడేళ్ల ప్రణాళిక

తెలంగాణలో పంచాయతీలను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమావేశం జరిపారు సర్పంచ్ పదవి కాలం ముగుస్తున్నందున పర్సన్ ఇన్చార్జీలుగా ఎవరినీ నియమించాలని ప్రధానంగా చర్చించారు వచ్చేనెల 2వ తేదీ నుంచి కొత్త పంచాయితీలు మనుగడ లోకి రానున్న దృష్ట్యా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది కొత్త పంచాయతీల ఆవిర్భావాన్ని పురస్కరించుకొని గ్రామాలను గొప్పగా తీర్చిదిద్దాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు పంచాయతీలను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు పచ్చదనం పరిశుభ్రత కాపాడటానికి తీసుకోవాల్సిన చర్యలు ఖర్చులు ఆదాయాలపై అధికారులు ప్రతినిధులు సమీక్ష నిర్వహించారు పంచాయితీలో తక్కువ జీతాలతో పనిచేసేవారి జీతాలు పెంచి పంచాయితీల ద్వారా గ్రామాభివృద్ధి పనులు చేయాలని నిర్ణయించారు పంచాయతీలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడానికి మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు ప్రతి మండలానికి ఒక వ్యర్ధ జలాల శుద్ధి కేంద్రం ఏర్పాటు చేసేందుకు పంచాయతీలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించనున్నట్లు సీఎం వెల్లడించారు పంచాయతీల కరెంటు బిల్లు పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు పంచాయతీలను బలోపేతం చేసేందుకు త్వరలోనే ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు కొత్త పంచాయితీలు మనుగడలోకి రానుండడంతో ప్రతి పంచాయతీ కార్యదర్శులు ఖచ్చితంగా ఉండేలా నియామకాలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు పంచాయతీలను ఆదర్శంగా తీర్చిదిద్దేలా పర్సన్ ఇన్చార్జులు కార్యదర్శులు ఏ విధమైన కార్యచరణ ఉండాలన్నదానిపై సమావేశంలో చర్చించారు గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను కలెక్టర్లు రాష్ట్ర స్థాయి అధికారులు పర్యవేక్షించాలని సూచించారు గ్రామాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని వీలుగా  కోటి రూపాయలు  గ్రామానికి అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి తెలిపారు కొత్తగా నియామకమైన కార్యదర్శులకు మూడేళ్ల ప్రొహిబిషన్ సమయం ఉంటుందన్న సీఎం చేయాల్సిన పనుల విషయంలో వాళ్లకు మార్గదర్శి చేసి ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు పనితీరు బాగా ఉన్నవారిని క్రమబద్ధీకరించి పని బాగా లేకపోతే తొలగించాలని నిర్ణయించారు గ్రామాల్లో చెట్లు పెంచడం నర్సరీలు ఏర్పాటు చేయడం స్మశాన వాటిక నిర్మించడం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం పన్నులు వసూలు చేయడం తదితర పనులు దానికి సంబంధించి ప్రణాళిక రూపొందించి పంచాయతీ కార్యదర్శుల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి సూచించారు కోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన సర్పంచ్లకు చట్టప్రకారం విధులు బాధ్యతలు అప్పగించా లని సూచించారు గ్రామాల అభివృద్ధిలో పంచాయతీల ప్రాముఖ్యతను క్రియాశీలకం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు 

No comments:

Post a Comment